Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా భర్తను నా తల్లే పెళ్లాడితే... వైరల్ అవుతున్న యువతి పోస్ట్!

  • లండన్ లో జరిగిన యథార్థ ఘటన
  • అల్లుడితో అత్త వివాహేతర సంబంధం
  • పదేళ్ల అనంతరం బయటపెట్టిన యువతి
"నా మొగుడిని, నా తల్లే పెళ్లాడింది..." అంటూ బ్రిటన్ కు చెందిన ఓ యువతి, వివాహం అనంతరం తనకు ఎదురైన ఓ అనుభవాన్ని ఫేస్ బుక్ లో షేర్ చేసుకోగా, అదిప్పుడు వైరల్ అయింది. సదరు యువతి పేరు లారెన్ వాల్. ఆమె పెట్టిన పోస్ట్ వివరాల్లోకి వెళితే...

భర్త నుంచి విడిపోయి, తన కుమార్తె లారెన్ ను పెంచిన ఓ మహిళ, ఆమె వివాహాన్ని ఘనంగా జరిపించింది. ఆపై వారిద్దరూ హనీమూన్ కు బయలుదేరగా, ఒంటరిగా ఉన్న తన తల్లి జూలీ పాల్ ను కూడా లారెన్ తీసుకెళ్లింది. ఆ సమయంలో వారిద్దరి ప్రవర్తన తేడాగా ఉన్నా, లారెన్ కు ఏ విధమైన అనుమానం కలగలేదు. ఆపై గర్భం దాల్చిన లారెన్, పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

జూలీ దగ్గరే లారెన్, ఆమె భర్త ఉంటున్న నేపథ్యంలో, జూలీకి, అల్లుడికి మధ్య వివాహేతర బంధం ఏర్పడగా, జూలీ కూడా గర్భం దాల్చి మరో బిడ్డకు జన్మనిచ్చింది. తన బిడ్డకు అల్లుడే తండ్రని ఆమె స్పష్టం చేయడంతో లారెన్ కంపించిపోయింది. కుమార్తెనైన తన విషయంలో తల్లి ఇలా చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని, బాధను దిగమింగుకోలేకపోతున్నానని, తల్లిని ఎప్పటికీ క్షమించబోనని లారెన్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొంది. ఆపై జూలీ, అల్లుడిని వివాహం చేసుకోగా, ఆ పెళ్లికి లారెన్ కూడా హాజరు కావడం కొసమెరుపు.

తన వివాహం 2004లో జరిగిందని, 2005లో తాను, 2009లో తన తల్లి ఒకే వ్యక్తి కారణంగా తల్లులుగా మారామని చెప్పిన లారెన్, 10 సంవత్సరాల పాటు ఈ విషయాన్ని తన మనసులో దాచుకున్నానని చెబుతూ వాపోయింది. లారెన్ స్టోరీ ఇప్పుడు వైరల్ కాగా, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
London
Laren
Post
Mother
Husbend
Marriage

More Telugu News